అంగరంఘ వైభవంగా శ్రీ బాలా నరసింహుని కళ్యాణం

Spread the love

పట్టు వస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్మన్
దేవాలయాల అభివృద్ధికి సహకరిస్తా
రోడ్డు మార్గం వేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భువనగిరి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ బాలా నరసింహ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైనది. దాదాపు 70 సం.ల పైచిలుకు చరిత్ర కలిగిన ఈ ఆలయం స్వయంభు ఆలయం. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయ చైర్మన్ కాకులారపు బొర్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందు రోజు ఉత్సవ విగ్రహాలను చిట్యాల పట్టణం నుండి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆచార్యత్వంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎంతో పురాతనమైన ప్రసిద్ధిగాంచిన దేవాలయం అని స్వయంభుగా వెలసిన ఈ ఆలయం ఎంతో మహిమ గలిగినదని తెలిపారు. భువనగిరి రోడ్డు నుండి దేవాలయం వరకు రోడ్డు మార్గానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేని కోరారు.


ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో కళ్యాణ మహోత్సవం కి రావడం సంతోషంగా ఉందని కచ్చితంగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని రోడ్డు మార్గాన్ని త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య కోనేటి కృష్ణ, పందిరి గీతా రమేష్, సిలివేరు మౌనిక శేఖర్, జిట్ట పద్మ బొందయ్యా, రెముడాల లింగస్వామి, కో ఆప్షన్ సభ్యులు పాటి మాధవరెడ్డి, రుద్రవరం పద్మ యాదయ్య, నాయకులు గుండెబోయిన సైదులు, మెండె సైదులు, పొన్నం లక్ష్మయ్య, జిట్టా చంద్రకాంత్, రంగా వెంకన్న, కోనేటి ఎల్లయ్య, దాసరి నరసింహ, చిత్రగంటి ప్రవీణ్, జిట్టా శేఖర్, అనువంశిక ధర్మకర్తలు కూనూరు నాగంగౌడ్, కూనూరు నరసింహ, కూనూరు పెద్ద అంజయ్య, కూనూరు నరసింహ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page