సికింద్రాబాద్,బేగంపేట్ రైల్వే స్టేషన్ల ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

Spread the love

సికింద్రాబాద్,బేగంపేట్ రైల్వే స్టేషన్ల ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్


సాక్షిత సికింద్రాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ డివిజన్‌లోని బేగంపేట మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు.ఈ తనిఖీల లో ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజన్‌ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎ.కె గుప్తా మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.అరుణ్ కుమార్ జైన్ మొదట బేగంపేట రైల్వే స్టేషన్‌లోతనిఖీ చేశారు.ఇక్కడ ప్రయాణీకులతో సౌకర్యాల గురించి సమీక్షించారు మరియు తదుపరి అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. బాహ్య పరిసర ప్రాంతాలలో కూడాతనిఖీ నిర్వహించారు.ప్రయాణీకులతో సంభాషించి వారి అనుభవాల గురించి తెలుసుకున్నారు.

బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌ స్టాల్‌ను జనరల్‌ మేనేజర్‌పరిశీలించారు.టికెట్ బుకింగ్ కార్యాలయాన్ని పరిశీలించి బుకింగ్ కౌంటర్‌లోని సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్‌లోని రాక్‌గార్డెన్‌ను కూడా సందర్శించారు.అనంతరం జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు.స్టేషన్‌లో జరుగుతున్నపునరాభివృద్ధి పనులపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా అంటే ప్లాట్‌ఫారమ్ నెం-1,నెం-10 వైపుపున రాబివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు.ప్రాజెక్టునునిర్ణీత తేదీలోగాపూర్తి చేసేలా పనులను మరింత వేగవంతంచేయాలనిఅధికారులకు సూచించారు. స్టేషన్‌లోని ప్రయాణికుల సౌకర్యాల గూర్చి జనరల్ మేనేజర్ సమీక్షించారు మరియు స్టేషన్ బాహ్య ఆవరణ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో
దక్షిణ మధ్య రైల్వేముఖ్య ప్రజా సంబంధాల అధికారిసి హెచ్.రాకేష్ పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page