ఎటువంటి అనుమతులు లేని ఇసుక రీచ్ ల నుండి ఇసుక అక్రమ రవాణా…..

Spread the love

ఎన్టీఆర్ జిల్లా నందిగామ:

ఎటువంటి అనుమతులు లేని ఇసుక రీచ్ ల నుండి ఇసుక అక్రమ రవాణా…..

కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామ ఇసుక రీచ్ నుండి అక్రమ రవాణా…

మున్నలూరు రీచ్ నుండి జిల్లాలో అనేక ప్రాంతాలకు ఇసుక మాఫియా రవాణా చేస్తున్నారు…

ఇసుక ను వ్యాలిడిటీ లేని బిల్లులతో తరలిపోతున్న పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, స్పెషల్ ఎంపోర్స్మెంట్ బ్యూరో అధికారులు…

ఇచ్చిన బిల్లులో మైలవరం స్టాక్ యార్డ్ నుండి ఇసుకను లోడ్ చేయాలని ఉంటే,మున్నలూరు రీచ్ నుండి ఎందుకు తరలిస్తున్నారు…?

తిరువూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని నమోదు చేస్తే, పాఠశాల కాకుండా ఇసుక ఎటు తరలిపోతుందో అంటున్న ప్రజలు…

ఇసుక బిల్లుల మీద మెట్రిక్ టన్నులు ఎందుకు నమోదు చేయలేదు…

12 టైర్ల లారీకి సుమారుగా రూల్ ప్రకారం 25 టన్నుల ఇసుక రవాణా చేయాల్సి ఉండగా….

సుమారు 60 టన్నుల ఇసుకను అధిక లోడుతో ఎందుకు తరలిస్తున్నా రంటున్న ప్రజలు….

అధిక లోడు తో ఇసుక లారీలు వెళుతుండడంతో…. ఆర్ & బి రోడ్లు ధ్వంసం అవుతున్న, అధికారులు చూస్తూ, మౌనం వహించడంలో ఆంతర్యం ఏమిటంటున్న ప్రజలు….

ఎవరు మమ్మల్ని అడుగుతారులే అని ఇసుక మాఫియా వారి యొక్క ఆగడాలు పెరిగిపోతున్నాయి…

అధికారులు ఎందుకు నోరు విప్పడం లేదు…. సామాన్య ప్రజల విషయంలో కూడా అధికారులు ఇలానే మౌనం వహిస్తారా …? అంటున్న ప్రజలు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page