వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల సీనియర్ సిటిజన్ పార్క్

Spread the love

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల సీనియర్ సిటిజన్ పార్క్ లో రూ. 20 లక్షల రూపాయల అంచనావ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను మరియు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవిడుపు పరికరాలు ను కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ పార్క్ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం ,సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు ,పెద్దలు , వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగినది అని. అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
రాబోయే రోజులలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని కాలనీ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని , ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామలు చెయ్యటం ఎంతో అవసరమని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని, ఆరోగ్యమే మహా భాగ్యం అని, కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

పార్క్ ను అన్ని రంగాలలో సుందరికరించి,అన్ని హంగులతో ,అన్ని రకాల మౌళిక వసతులతో సుందరికరించి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని, వాకింగ్ ట్రాక్ నిర్మాణం ద్వారా పిల్లలకు, పెద్దలకు వాకింగ్ చేసుకోవడానికి సులభంగా ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుంది అని , పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ,అన్ని రకాల వసతులు కలిపిస్తామని, పార్క్ లలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, రాంచందర్ ,కార్తిక్ రావు, హిమగిరి రావు, శ్రీనివాస్ రెడ్డి, చంద్రమోహన్ సాగర్,రవి, చంద్రశేఖర్, ఎర్ర లక్ష్మయ్య , లక్ష్మీ నర్సయ్య, రమణ రెడ్డి, మురళి మరియు కాలనీ వాసులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page