Seeing Minister Satyavati Rathore, they voluntarily left their homes
సాక్షిత : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఆంగోతు తండా లలో ఇంటింటికి తిరుగుతూ, కెసిఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ విస్తృత ప్రచారం నిర్వహించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ .
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ ప్రభుత్వాన్ని బలపర్చలని కోరిన మంత్రి.
గడపగడప ప్రచారం నిర్వహిస్తూ నేరుగా ప్రజలను తో మమేకమవుతూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని అండగా నిలుస్తున్న మంత్రి.
మంత్రి ప్రచారంలో విశేష స్పందన.
ఒక తండా నుండి మరో తండాకు బైక్ పై వెళుతూ ప్రచారం చేస్తూ ఓటర్లలో ఉత్సాహాన్ని నింపిన మంత్రి.,
తండాల్లో రోటి పచ్చట్లు నూరి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్న మంత్రి
మంత్రి సత్యవతి రాథోడ్ ని చూసి, స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటికి వచ్చి మేము మీ వెంటే అంటూ ప్రచారంలో మంత్రితో కదిలిన గిరిజనం.
గిరిజనులకు అన్ని విధాలా అండగా నిలిచిన కేసీఆర్ కే మా ఓటు అంటూ ముక్తకంఠంతో చెబుతున్న ప్రజలు.
……….
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….
18 వేల కోట్లకు బిజెపికి అమ్ముడుపోయిన స్వార్ధపరుడు రాజగోపాల్ రెడ్డి.
రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే తండాలు అభివృద్ధి చెందలేదు.
కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెసిఆర్ పట్ల ఇక్కడి ప్రజల ప్రేమ చూస్తుంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ విజయం ఖాయం.
టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతో తాండాల రూపురేఖలు మారుతాయి.
ఈ ప్రాంత అభివృద్ధి నా బాధ్యత.
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన ఆరాధ్య దైవం.
తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది.
ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచి గిరిజనులకు విద్య, ఉద్యోగ అవకాశాలను గణనీయంగా పెంచారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి అనేక పథకాలను విజయవంతంగా కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోంది..
వృద్ధులకు, వితంతువులకు వికలాంగులకు, ఇతర వర్గాలకు పెన్షన్లు అందజేసి వారి కుటుంబ సభ్యులు సంతోషం నింపుతున్నారు.
గతంలో మహిళలు గుక్కెడు తాగునీటి కోసం తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం మహిళలు బిందెలు పట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఉండేది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఇంటింటికి మిషన్ భగీరథ స్వచ్ఛనీరు అందుతుంది.
టిఆర్ఎస్ అభ్యర్థి కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుత్తున్న.
………
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు, వైస్ ఎంపీపీ రాజు నాయక్, మాజీ సర్పంచ్ బిచ్చు నాయక్, కుమార్, బిచ్చా నాయక్,రాజు నాయక్ కార్తీక్ నాయక్, కిషన్ మోహన్, భాను, దూద్యా, దశరథ్, హరిక, రాజేశ్ నాయక్, సోని తదితరులు పాల్గొన్నారు