సేవ్ వాటర్ – సేవ్ ఎర్త్

Spread the love

సేవ్ వాటర్ – సేవ్ ఎర్త్

ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్.
ఈరోజు అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాల కొండకల్ తండాలో విద్యార్థులకు నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్,ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ… నీరు జీవకోటికి ప్రాణాధారం, నీరు లేనిది భూమిపైన జీవం లేదని,భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని,ప్రతి ఒక్కరం జల సంరక్షణ కోసం పునరంకితమై,ఇళ్లల్లో ఇంకుడు గుంతలు నిర్మించి మనం ఉపయోగించి వదిలేసినటువంటి వృధా నీటిని,మరియు మేడల పైనుండి వచ్చే వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం,రైతులు పొలాల్లో ఆనకట్టలు నిర్మించినట్లయితే వర్షపు నీరు కాలువల ద్వారా, నదుల ద్వారా సముద్రంలో కలిసిపోకుండా ఎక్కడికక్కడే ఇంకిపోయి భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉంటాయని, తద్వారా వేసవి కాలంలోనూ నీటి కొరత ఉండదని తెలియజేయడం జరిగింది.ప్రస్తుతం మనం నీటిని ఎంతో జాగ్రత్తగా అవసరానికి తగినంత పొదుపుగా వాడుకున్నట్లయితే మనం మన భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారమవుతామని అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ మరియు ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్, కుక్ కం హెల్పర్ కమలమ్మ,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page