నిరుపేదరాలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం పంజుగుల సర్పంచ్

Spread the love

Sarpanch of Panjugula financial assistance for construction of poor houses

నిరుపేదరాలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం పంజుగుల సర్పంచ్. పండుగ పద్మ అంజయ్య యాదవ్


సాక్షిత ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఇందిరానగర్ రోడ్ నెంబర్ 8లో విజయలక్ష్మి భర్త కీర్తిశేషులు జంగయ్య ఇల్లు భారీ వర్షాలకు పూర్తిగా కూలిపోవడంతో విజయలక్ష్మి దాతల సహాయ సహకారం కోరింది. దీనిపై పలు పత్రిక లో కథనం చూసిన వెంటనే స్పందించిన పంజుగుల సర్పంచ్ పద్మ అంజి యాదవ్.విజయలక్ష్మి ఇల్లు నిర్మాణం కోసము తన వంతు ఆర్థిక సహాయం చేయడమే కాక బేస్మెంట్ కోసం మొరం వేయిస్తానని ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చారు .

ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ వంతు ఆర్థిక సహాయమే కాక ఇంటి పునాది కోసం మొరం కూడా వేయించడం జరుగుతుందని ఎంతోమంది గొప్ప నాయకులు,ఫౌండేషన్, చారిటబుల్ ట్రస్ట్,అన్నదాతలు, సహకరించి మట్టి ఇల్లు కూలిపోయి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న నిరుపేద అయినా విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ జంగయ్య కుటుంబానికి అండగా నిలిచి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page