Sarpanch Neela Kumaraswamy said that the state government will support the farmers
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని సర్పంచ్ నీల కుమారస్వామి , వైస్ ఎంపీపీ లత అన్నారు
వీణవంక మండల కేంద్రంలో శ్రీ వెన్నెల గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ నీల కుమారస్వామి వైసీపీ ఎంపీపీ లతా శ్రీనివాస్ లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు సెంటర్లో విక్రయించుకొని ఏ గ్రేడ్ కు 2060 సాధరణ రకానికి 2040 అందిస్తామని తెలిపారు రైతులు తేమ తాలు లేకుండా ధాన్యాన్ని తీసుకువచ్చి తగిన మద్దతు ధర పొందాలని రైతులను కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భానుచందర్, ఐకెపి సీసీలు శ్యామ్, శ్రీకాంత్, వార్డ్ మెంబర్లు, హమాలీలు, రైతులు, పాల్గొన్నారు.