సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే: మంత్రి సీతక్క

Spread the love

రాజన్న జిల్లా:
వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఆయలం వెలుపల మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ..

సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు.

గత పాలకులు పదేండ్లపాటు సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపారని విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తిరస్కరించి తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తప్పుడు మాటలను ప్రజలు ఇక నమ్మని పరిస్థితి వచ్చిందని, సోషల్‌ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పట్టిందెవరుని ప్రశ్నించారు. తాము సక్రమంగా పని చేస్తేనే మళ్లీ అధికారం ఇస్తారు, చేయకపోతే అవకాశం ఇవ్వరని తెలిపారు.

వేములవాడ రాజన్న తమ ఇలవేల్పని, కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటామన్నారు. ఆదివాసి కుటుంబంగా మాకు ఆనవాయితీ ఉంది.. సమ్మక్క జాతరకు ముందు వచ్చి దర్శించుకుంటాని చెప్పారు.

రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించారు. తొందర్లోనే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమ వుతారని చెప్పారు.

మన ఆచారాలు, సాంప్రదాయాలుకు అనుగుణంగా దేవుళ్లను కొలుచుకుంటాం, కానీ కొందరు ఈ దేవుళ్లనే కొలవాలని చెబుతూ వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మన సంస్కృతి సాంప్రదా యాలను చరిత్రను కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page