సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు

Spread the love

వరంగల్‌ : ఇటీవల ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని తితిదే కల్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను ఆరు రోజులుగా లెక్కించారు.

లెక్కింపు ప్రక్రియలో మొత్తం 350 మందికి పైగా సిబ్బంది, మహిళా వాలంటీర్లు పాల్గొన్నారు. మొత్తం రూ.13,25,22,511 ఆదాయం సమకూరినట్లు మేడారం కార్యనిర్వాహక అధికారి రాజేంద్రం తెలిపారు. అదనంగా 779.800 గ్రాముల బంగారంతో పాటు, 55.150 కిలో గ్రాముల వెండి ఆభరణాలు సైతం వచ్చాయి. వివిధ దేశాల కరెన్సీ నోట్లు, ఒడి బియ్యం, ఇతర కానుకలను భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారు. రెండేళ్ల కిందట జరిగిన మహా జాతరకు రూ.11,45,34,526 ఆదాయం రాగా గతంతో పోలిస్తే ఈసారి రూ.1,79,87,985 ఆదాయం పెరిగింది.

Related Posts

You cannot copy content of this page