మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని నిరూపించిన ఆర్కే ఫౌండేషన్..

Spread the love

అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన వైనం..

భార్య పిల్లలు ఉన్న పట్టించుకోని పరిస్థితి

“ఆ నలుగురి” సహకారంతో అంత్యక్రియలు..

సినిమా కథ నీ తలపించేలా నిజ జీవిత సంఘటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :

కొన్ని కొన్ని సంఘటనలు సినిమా కథను తలదన్నేలా ఉంటాయి అలాంటి సంఘటన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది..గత కొంతకాలంగా ఆర్కె ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతూ అనారోగ్య కారణాలవల్ల రెడ్డి బోయిన కృష్ణ మృతి చెందగా భార్య కుటుంబీకులు ఎవరు అంత్యక్రియలకు రానని తెలియజేయడంతో మధిర టౌన్ పోలీసుల సహకారంతో బంధుమిత్రుల సమక్షంలో “ఆ నలుగురి “సహకారంతో ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల జ్యోతి రామకృష్ణ సుదర్శన్ రామారావు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.

గత సంవత్సరం నవంబర్ నెల మూడవ తారీకు నాడు మధిర మార్కెట్ యార్డ్ వద్ద కాళ్లు చేతులు పడిపోయి గుర్తు తెలియని వ్యక్తి పడిపోయాడు అన్న సమాచారంతో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి గమనించి ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు…అప్పటినుండి కాళ్లు చేతులు పడిపోయి లేవలేని స్థితిలో ఉన్న రెడ్డిబోయిన కృష్ణను ఆర్కే ఫౌండేషన్ వారు చూసుకుంటూ ఉండగా.. భార్య పిల్లలకు విషయం తెలియజేసిన వారెవరు కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొంది.

ఈ విధంగా కొన్ని రోజులు జరుగుగా గత రాత్రి అనారోగ్యంతో కృష్ణ మరణించడం జరిగింది. మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అనటానికి నిదర్శనం ఆర్కే ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలే…
ఎక్కడ అనాధలు మరణించిన లేవలేని స్థితిలో రోడ్డు వెంబడి కనబడిన మతిస్థిమితం లేక మానసిక వికలాంగులైన వారికి తగిన ఆశ్రయం కల్పించి ఎక్కడ ప్రమాదం జరిగిన క్షణాల్లో వారికి తగిన వైద్య సేవలు అందిస్తూ..ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారిని పలువురు పట్టణ ప్రముఖులు అభినందన ప్రశంసల జల్లు కురిపించారు.

Related Posts

You cannot copy content of this page