రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా రేవంత్ రెడ్డి హత్ సే హత్ పాదయాత్ర

Spread the love

Revanth Reddy Hat Se Hat Padayatra inspired by Rahul Gandhi’s Bharat Jodo Yatra

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా రేవంత్ రెడ్డి హత్ సే హత్ పాదయాత్ర విజయవంతం చేద్దాం


సాక్షిత : ములుగు, వేంకటా పూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం
ముఖ్య అతిథిగా హాజరైన
*కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *
ములుగు జిల్లా కేంద్రములో ములుగు మండలం మరియు వేంకటా పూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా అధ్యక్షతన నిర్వహించగా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క


ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 6న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో సమ్మక్క సారలమ్మ సాక్షిగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తలపెట్టిన హత్ సే హత్ పాదయాత్ర ములుగు నియోజక వర్గం లోని తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల నుండి మొదలు కాబోతున్నది అడవి బిడ్డల హక్కుల కోసంఆఖరి ఊపిరి వరకు పోరాడిన సమ్మక్క – సారలమ్మల సాక్షిగా
భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో హత్ సే హత్ జోడో యాత్ర ములుగు గడ్డ మీద నుండి


రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2లక్షల రైతు రుణమాఫీ పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం,రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని


కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు మన నాయకుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది అని పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి అని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి రవళి రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిపిసిసి సభ్యులు మల్లాడి రాం రెడ్డి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,బండి శ్రీనివాస్,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి


యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,తో పాటు గ్రామ మండల జిల్లా నాయకులు కార్యకర్తలు గ్రామ కమిటీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page