పేద ప్రజలకు నాణ్యతతో కూడిన రేషన్ సరఫరా చేయాలి

Spread the love

Quality ration should be provided to poor people

పేద ప్రజలకు నాణ్యతతో కూడిన రేషన్ సరఫరా చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణము, మండలము మరియు ధారూర్ మండల రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు.

పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ లో నాణ్యమైన విధంగా సరఫరా చేయాలని DM కి సూచించారు.

మండల స్థాయి స్టాక్ పాయింట్ వద్ద తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తూకం చేసి ఇవ్వాలని, మరియు ప్రజలకు పంపిణీ చేస్తున్న క్రమంలో సరైన పద్ధతులు పాటించాలన్నారు.

రేషన్ డీలర్లు తెలిపిన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణం, మండలం ధారూర్ మండల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page