SAKSHITHA NEWS

[3:23 PM, 3/6/2024] Sakshitha: క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేద ప్రజలను దోచుకోవడమేనా ప్రజా పాలన….?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు \, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
[3:25 PM, 3/6/2024] Sakshitha: సాక్షిత : కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అనుభవరాహిత్యంతో సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి తయారైంది….?
20వేల కోట్ల రూపాయలే లక్ష్యంగా నిరుపేద ప్రజల రక్తం తాగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతుంది…
కాంగ్రెస్ అంటే కష్టాలు…. కష్టాలు అంటేనే కాంగ్రెస్ అనేలా తయారైంది రాష్ట్రంలో పాలన తీరు…
కుత్బుల్లాపూర్ చౌరస్తాలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఇళ్ల క్రమబద్ధీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ఎండగడుతూ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ

గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది.*
అప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు ,ఇప్పుడు నోరు ఎందుకు తెరవడం లేదు అని ప్రశ్నించారు.*
ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలి.*

అప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ మాట్లాడిన రేవంత్, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వహించారో ప్రజలకు చెప్పాలి.*

ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది పైన కనీసం లక్ష రూపాయల భారం పడనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమభద్దీకరణ చేయాలని డిమాండ్ చేశారు.*

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఉచితంగా భూ క్రమబద్ధీకరణ చేయాలని నాడు అరిచి గీపెట్టిన కాంగ్రెస్ నాయకులు, నేడు అధికారంలోకి రాగానే మార్చి 31 తేదీ లోపు రుసుమును చెల్లించి భూ క్రమబద్ధీకరణ చేసుకోవాలని ఫోన్ ద్వారా దరఖాస్తుదారులకు సమాచారం అందించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.

100 రోజులు పూర్తికావడానికి ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉందని… ఈ వందరోజుల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని, కష్టాలు అంటే కాంగ్రెస్… కాంగ్రెస్ అంటేనే కష్టాలు అనే విధంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు.

100 రోజులు పూర్తయిన తెల్లారి నుంచే ప్రజల పక్షాన పోరాడుతూ ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ సత్తాచాటుతాం.

అనంతరం భూ క్రమబద్దీకరణకు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా చేపట్టాలని కోరుతూ కుత్బుల్లాపూర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లు,కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS