ప్రభుత్వ భూములకి రక్షణ లేదా మళ్ళీ నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాలు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో గత కొంత కాలం క్రితం ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. గత రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడ పనిచేస్తుండగా అనేక అక్రమ కట్టడాలకు పునాదులు పడ్డాయి. ఆ తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యల వల్ల చాలావరకు ఆ అక్రమ కట్టడాలను కూల్చి వేయడం జరిగింది. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ప్రభుత్వ అధికారులు తీసుకున్న చొరవ చాలా వరకు ప్రభుత్వ భూముల్ని రక్షించిందని చెప్పాలి.


లంచాలకు బాగా అలవాటు పడిన రెవెన్యూ అధికారులు ఈ భూములను అక్రమ కట్టడాలు నిర్మిస్తూ భూకబ్జాలు చేసే వారికి సహకరిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు దీనికి నిలువెత్తు సాక్ష్యాలు కులగోట్టినటువంటి నిర్మాణాలు మళ్ళీ పునర్నిర్మాణంలోకి రావడమే.


అప్పటి ఆర్ఐ సస్పెండ్ అయిపోవడం వల్ల కొత్తగా వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు మళ్ళీ నిర్మితమవుతున్న అక్రమ కట్టడాలు చూసి చూడనట్టు వ్యవహరించడం విడ్డురంగా ఉంది అని అంటున్న స్థానిక ప్రజలు , గతంలో నిర్మాణమైనటువంటి అక్రమ కట్టడాలను ప్రభుత్వం చాలావరకు కూల్చివేసినప్పటికీ తిరిగి వాటిని పునర్మించడానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయ్ … ఆ ఏరియాలో భూకబ్జాలకు పాటుపడుతున్నటువంటి భూకబ్జాదారులు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి అయిదు లక్షల బేరం పెట్టి అక్రమంగా కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు. కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన ప్రభుత్వ అధికారులే లంచాలకు అలవాటు పడి, అనేక అక్రమ నిర్మాణాలకు, భూకబ్జాలకు సహకరిస్తున్నందువలన ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల కబ్జాలోకి వెళ్ళిపోతున్నాయి అని ఆ ప్రాంతంలోని ప్రజలు వాపోతున్నారు.


ప్రభుత్వ భూములు రక్షించాల్సిన వాళ్ళు కబ్జాదారులకు సహకరిస్తునట్టు ఉంది
తక్షణమే ప్రభుత్వ అధికారులు ఈ భూకబ్జాదారులపై అక్రమమైనటువంటి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై వెంటనే చర్య తీసుకుని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు

Related Posts

You cannot copy content of this page