గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై పోలీసుల దాడులు

Spread the love

నలుగురు (4) గంజాయి స్మగ్లర్ లు అరెస్ట్, సుమారు 12.100 కేజీలు బరువున్న ఎండు గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం.

కడప జిల్లా SP సిద్దార్థ కౌశల్ ఆదేశాల మేరకు, మైదుకూరు DSP సూచనల మేరకు, రాబడిన సమాచారము పై, మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ A.P మస్తాన్ , SI- N. రాజ రాజేశ్వర రెడ్డి , SI B. ఘణ మద్దిలేటి  మరియు వారి సిబ్బంది  ద్వారా నిఘా ఉంచి,   నిన్నటి రోజు అనగా 19.03.2024 వ తేదిన సాయంత్రము 03.30 PM  గంటలప్పుడు మైదుకూరు టౌన్ వీణ విజయ రామ రాజు కాలనీ నందు, సామ్బారావు వెంకటయ్య @ సుబ్బరాయుడు కొట్టము వద్ద క్రింద తెలిపిన గంజాయి స్మగ్లర్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి  సుమారు 12.100  కేజీలు  బరువున్న ఎండు గంజాయి, ఒక మోటార్ సైకిల్  స్వాధీన పరచుకున్నారు.

అరెస్ట్ కాబడిన ముద్దాయిలు   

(1) మదెం సుస్మంత్ కుమార్, వయస్సు 21 సం,,లు, s/o ఆశీర్వాదం, విద్యార్థి, నివాసము గొల్లపల్లి గ్రామం, మైదుకూరు మండలం, కడప జిల్లా.

(2) గంధం సుబ్బారాయుడు, వయస్సు 35 సం,,లు, s/o వెంకట సుబ్బారాయుడు, వృత్తి :బెల్ధారి, నివాసరము లక్ష్మి నగర్, చెన్నూరు టౌన్ మరియు మండలము, కడప జిల్లా.

(3) మేకల సునీల్ వయస్సు 20 సం” రాలు, తండ్రి మర్కయ్య , వృత్తి : మునిసిపాల్టీ వర్కర్, నివాసము ఇంటి నెంబర్ 7/2730, శ్రీనివాసనగర్, ప్రొద్దటూరు టౌన్, కడప జిల్లా.

(4) సాంబరావు వెంకటయ్య @ సుబ్బరాయుడు , వయస్సు 50 సం” రాలు, వృత్తి: బెల్ధారి పని, నివాసము: వీణ విజయరామరాజు కాలనీ, మైదుకూరు టౌన్ మరియు మండలము, కడప జిల్లా.

ముద్దాయిల వద్ద నుండి స్వాధీనపరుచుకున్న వస్తువుల వివరాలు:

(1) సుమారు 12.100 కేజీలు బరువున్న ఎండు గంజాయి విలువ సుమారు లక్షా ఇరవై వేల రూపాయలు చేయును.
(2) యమహా కంపెనీ F/Z మోటార్ సైకిల్ రిజిస్టర్ నెంబర్:AP21AB7951.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page