కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోలీసుల ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్ పై యువతకు అవగాహన

Spread the love

police-in-veenavanka-mandal

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోలీసుల ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్ పై యువతకు అవగాహన*
కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని అన్ని గ్రామాల యువతకు వాట్సప్ గ్రూప్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని వీణవంక పోలీస్ స్టేషన్ లో SI శేఖర్ రెడ్డి నిర్వహించగా.. ముఖ్య అతిథిగా హాజరైన జమ్మికుంట రూరల్ సీఐ సురేష్ మాట్లాడుతూ ..

యువత వాట్సాప్ గ్రూపులలో సందేశాలను ఎవరు కించపరిచే విధంగా పెట్టవద్దు అని సూచించారు. ఏ సందేశమైన ఏ రాజకీయ పార్టీనీ కించపరిచే విధంగా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేలా చూసుకోవాలని సూచించారు. గ్రూపులో చాటింగ్ ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగితే వారు ఫిర్యాదు చేయడం జరుగుతుందని దానివల్ల యువత బంగారు భవిష్యత్తును నాశనం అవుతుందని తెలిపారు.

👉ప్రభుత్వ/ ప్రైవేట్/ ఉద్యోగానికి పోలీస్ స్టేషన్ ద్వారా NOC ఇవ్వడం జరుగుతుందని చిన్న పిటి కేస్ నమోదు అయితే ఉద్యోగానికి అర్హతను కోల్పోతారని సూచించారు.

👉గ్రూపులలో లింక్ ఓపెన్ చేస్తే డాటా ఫ్రీ వస్తది అనే లింకులు ఓపెన్ చేయడం ద్వారా మీ డాటా మొత్తం సైబర్ నేరాగాలు చెంతకు చేరుతుందని అలాంటి లింకులు ఓపెన్ చేయవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. అలాంటి లింకులను ఎవరు కూడా గ్రూపులలో షేర్ చేయకూడదని హెచ్చరించారు.

👉గ్రామాలలో యువత చెడు అలవాటులకు బానిస కాకుండా చూసుకోవాల్సిన అవసరం అందరిపైనా మరియు పిల్లల తల్లిదండ్రుల పైన ఉంటుందని, ఎటువంటి సమాచారమైన పోలీసులకు తెలియజేసినట్లయితే( 100 డయల్ ) తుదిలోనే అరికట్టవచ్చని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సై శేఖర్ రెడ్డి సిబ్బంది యువత పాల్గొన్నారు…..
police

Related Posts

You cannot copy content of this page