SAKSHITHA NEWS

‘People’s Diary’ calendar was launched by Minister Puvwada

పీపుల్స్ డైరీ’ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ

హాజరైన టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) బృందం


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రజాచైతన్యంతో పాటు సంచలనాత్మక కథనాలకు కేంద్ర బిందువు పీపుల్స్ డైరీ పత్రిక అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం వీడియోస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో పీపుల్స్ డైరీ 2023 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. నిష్పక్షపాత కథనాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి, ప్రచారానికి ఈ పత్రిక పెద్దపీట వేస్తున్నదన్నారు.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారధిగా నిలిచిన ఈపత్రిక ఎన్నోసమస్యల పరిష్కారానికి కృషిచేస్తు మార్గదర్శిగా నిలిచిందన్నారు. అలాంటిఈ పత్రిక అనతికాలంలోనే అందరి ఆధార అభిమానులను చూరగొన్నదని, నిప్పు కనిక వంటి పీపుల్స్ డైరీ, క్యాలెండర్ను తాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం కృషిని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో పీపుల్స్ డైరీ బ్యూరో బండి కుమార్, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, టెంజూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు బాలబత్తుల రాఘవ,

కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి జానీ పాషా, కోశాధికారి కొరకొప్పుల రాంబాబు, టెంజూ నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, నాయకులు రాజేంద్రప్రసాద్, యం. కోటేశ్వరరావు, టీఎస్ చక్రవర్తి, బిక్కి గోపి, బోయిన కృష్ణ, పిన్ని సత్యనారాయణ, పానకాలరావు, మోహన్, జక్కుల వెంకటరమణ, వెంపటి నాయుడు, యాదగిరి, యాకుబ్ పాషా, మనోహర్, ఖాసీం, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS