పత్రిక నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలి: ప్రభుత్వ విప్. ఆరేకపూడి గాంధీ

Spread the love

Patrika Nagar should be surrounded by green trees: Government Whip. Arekapudi Gandhi

 పత్రిక నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలి: ప్రభుత్వ విప్.   ఆరేకపూడి గాంధీ

 సాక్షిత :  కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ లో   పత్రిక నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యం తో రూ. 5,00,000/- రూపాయల అంచనావ్యయం తో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మరియు పిల్లల కోసం ఏర్పాటు  చేసిన ఆటవిడుపు పరికరాలు ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి మొక్కలు నాటిన ప్రభుత్వ విప్  ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ    ఓపెన్  జిమ్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం ,సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు ,పెద్దలు , వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు  చేయడం జరిగినది అని.

 అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
రాబోయే రోజులలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని కాలనీ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని , ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామలు చెయ్యటం ఎంతో అవసరమని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని, ఆరోగ్యమే మహా భాగ్యం అని, కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

 పార్క్ ను అన్ని రంగాలలో సుందరికరించి,అన్ని హంగులతో ,అన్ని రకాల మౌళిక వసతులతో సుందరికరించి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని, వాకింగ్ ట్రాక్ నిర్మాణం ద్వారా పిల్లలకు, పెద్దలకు వాకింగ్ చేసుకోవడానికి సులభంగా ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుంది అని , పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ,అన్ని రకాల వసతులు కలిపిస్తామని, పార్క్లలో చక్కటి   ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని  ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

 అదేవిధంగా పత్రిక నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలని,  హైటెక్ సిటీకి వెనక భాగంలో ఉన్న పత్రిక నగర్ కు చాలా ప్రాధాన్యత ఉందని ఆ ప్రాధాన్యతలో భాగంగా పత్రిక నగర్ లోగల పార్కుల్లో పచ్చని చెట్లు కనిపించాలని దానికి పత్రిక నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని కాలుష్యాన్ని రూపుమాపి ఆరోగ్యకర వాతావరణానికి చెట్లు ఎంతగానో దోహదపడతాయని, పార్కులో లో పూలు పండ్లు ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు నాటి వాటి పరిరక్షణకు సహకరించాలని కోరారు.

 ప్రభుత్వ పరంగా పత్రికా నగర అభివృద్ధికి కృషి చేస్తామనీ హామీ ఇచ్చారు. పత్రిక నగర్ లో అందరూ ఐకమత్యంగా ఉంటూ రాష్ట్రంలోని ఆదర్శ కాలనీ గా అభివృద్ధి చేసేందుకు అసోసియేషన్ కృషి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమంలో GHMC అధికారులు DE రమేష్, టౌన్ ప్లానింగ్ ACP మెహ్రా, TPS విశాల్, AMoH నగేష్ నాయక్, స్ట్రీట్ లైట్స్ EE మల్లికార్జున రావు ,AE రాజశేఖర్,మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, తిరుపతి, శ్రవణ్ యాదవ్ ,రాజు యాదవ్, అశోక్ సాగర్,సాయి,శివ 

మరియు పత్రిక నగర్ కాలనీ వాసులు

శ్రీనివాస్ రావు, రామకోటయ్య, అనజనేయులు,సుధాకర్,నాగేశ్వరరావు, రవి కుమార్,రాజేంద్రప్రసాద్, రమేష్,మురళి,చంద్రకాంత్,హేమ సుందర్,సురేష్ బాబు,రమాకాంత్,రమేష్ రెడ్డి,కృష్ణ రెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page