సాక్షిత : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం లక్ష్యంగా ఏర్పాటు చేసిన సురక్ష క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కోరారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 47 డివిజన్ జర్నలిస్ట్ కాలనీ, ఎర్రమిట్ట లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ లో నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వైద్యం కోసం పేదవాళ్లు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్య సురక్ష క్యాంప్ ద్వారా చికిత్సలను అందిస్తున్నామని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా. వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. స్పెషలిస్ట్ డాక్టర్ చేత వారికి చికిత్స అందిస్తున్నామని, తర్వాత వారికి అవసరమైన పరీక్షలు కూడా చేయించి, వారిని ఇంటి వద్దకు సురక్షితంగా తీసుకువెళ్లి అప్పజెప్పడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని, ఆరోగ్య సావన్ వదిన తర్వాత సంబంధిత పేషెంట్లకు అవసరమైన మందులు అందేలా చూస్తున్నామని తెలియజేశారు. ఆరోగ్య సురక్ష సభలో నిర్వహించిన క్యాంపులో 17వందల మంది చేసుకున్నారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక కార్యదర్శి రాధిక రెడ్డి, సూపర్డెంట్ రవి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సూరిబాబు, జూనియర్ అసిస్టెంట్ రాధాకృష్ణ, డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.