గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం

Spread the love

Our government’s program for Gadapa Gadapa

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన డ్రైనేజ్ మరియు సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా
సాక్షిత : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా పుత్తూరు రూరల్ మండలం తిరుమల కుప్పం సచివాలయం పరిధిలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో 20 లక్షల రూపాయల మరియు 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్స్ తో మంజూరైనా డ్రైనేజ్ మరియు సిమెంట్ రోడ్ల మరియు పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు.

నిరుపేదల గృహాలకు ఉచితంగా సిమెంట్ పంపిణి చేసిన మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా వడమాలపేట మండలం బట్టి కండ్రిగ గ్రామంలో ఏ.ఎం పురం మరియు నారాయణ పురం గ్రామాలకు చెందిన 25 నిరుపేద ఎస్.సి, ఎస్.టీ కుటుంబాల వారికీ రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అసంపూర్ణ గృహ నిర్మాణాల కోసం ఉచితంగా 700 బస్తాల సిమెంట్ బస్తాలను బుధవారం పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో వడమాలపేట ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర డైరెక్టర్లు , కమిటీ చైర్మన్లు, సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మండల అధికారులు, పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page