గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

Spread the love

Our government’s program for Gadapa Gadapa

సాక్షిత : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 33వ వార్డు దేవేంద్ర థియేటర్ వద్ద అశోక్ నగర్, అబ్బన్న కాలనీ లో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఇంటి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలతో మమేకమయ్యారు, స్థానిక ప్రజల వినతులను స్వీకరిస్తూ అప్పటికప్పుడు అధికారులతో పరిష్కార దిశగా చర్చించారు.

ఇందులో ఉప మేయర్ ముద్ర నారాయణ, స్థానిక కార్పొరేటర్లు దూది కుమారి, రామస్వామి వెంకటేశ్వర్లు, వార్డు అధ్యక్షులు మద్దాలి శేఖర్ రాయల్, దూది శివ, లవ్లీ వెంకటేష్, గోవింద్ రెడ్డి ఇతర వార్డు అధ్యక్షులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది,నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page