అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామం వద్ద రాత్రి సుమారు 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానిక ఎస్సై.ఎస్ శివప్రసాద్ తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం మండల కేంద్రమైన ఆలమూరు గ్రామానికి చెందిన ఒక మహిళ, నలుగురు వ్యక్తులు మొత్తం ఐదుగురు కలిసి మారుతి సుజుకి షిఫ్ట్ కార్ అయిన ఏపీ 39 సిడి 5757 నెంబర్ గల వాహనంపై ఆలమూరు నుండి రాజమహేంద్రవరం వైపు ప్రయాణిస్తుండగా మూలస్థానం అగ్రహారం గ్రామం వచ్చే సరికి అదుపుతప్పి డివైడర్ ను బలంగా ఢీకొని కారు పల్టీలు కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా అదే మార్గంలో మోటార్ సైకిల్ ఏపీ 39 హెచ్ ఎస్ 7224 నెంబర్ గల వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారు వెనుక నుండి ఢీకొనగా తీవ్రగాయాలు అయినట్లు, మొత్తం కార్లో ప్రయాణిస్తున్న ఒక మహిళ ముగ్గురు వ్యక్తులను, మోటారు వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని కలిపి చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్ పై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అలాగే మృతదేహాన్ని సంబంధిత ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలియజేశారు.అనంతరం సంఘటన స్థలంలో హైవే మొబైల్ ఇంచార్జ్ రావులపాలెం హెడ్ కానిస్టేబుల్ విఏబిఎస్.స్వామి,పోలీస్ సిబ్బంది సహకారంతో హైవే ట్రాఫిక్ నివారించడం జరిగింది.