అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని ఖచ్చితంగా అమలు చేయాలి
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్
…….
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని అన్ని శాఖల కార్యాలయాల సందర్శన చేసి, రాజకీయ నేతల, రాజకీయ పార్టీలకు సంబంధించి క్యాలెండర్లు, పోస్టర్లు ఫోటోలు తొలగించింది పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం లోకసభ ఎన్నికల షెడ్యూల్ ను. ఈ నెల 16న విడుదల చేసిందని, షెడ్యూల్ విడుదలైన తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల్లో 24 గంటల్లో, పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద 48 గంటల్లో, ప్రయివేటు స్థలాల్లో 72 గంటల్లో రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, ఫోటోలు తొలగించాలని, విగ్రహాలకు ముసుగు వేయాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, నియమ నిబంధనలు అధికారులు, సిబ్బంది తప్పక పాటించాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా శిక్షణా సహాయ కలెక్టర్ యువరాజ్, ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వున్నారు.