ఒడిశా రైలు ప్రమాదం అత్యంత బాధాకరం – ప్రియదర్శిని మేడి

Spread the love

మృతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఆదుకోవాలి
చనిపోయిన
కుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి
నకిరేకల్ సాక్షిత

ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత బాధాకరమని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి
అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశా (బాలాసోర్) రైలు ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని అలాగే మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల రూపాయలు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి ) నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు. కోల్ కత్తా లోని షాలిమార్ స్టేషన్ నుంచి తమిళనాడులోని చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం ఘోర ప్రమాదానికి గురవడం వందల మంది చనిపోవడం వేలాదిమంది క్షతగాత్రులు కావడం అత్యంత బాధాకరం అని వ్యక్తంచేశారు.

కేంద్రంలో నరేంద్రమోడీ వేగం వేగం అంటూ వేగాన్ని పెంచే రైలు తెస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నాడు.నేడు జరిగిన రైలు ప్రమాదం అత్యంత వేగం వల్ల జరిగిందని తెలుస్తుందని రైళ్లు వేగాన్ని తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హడావిడిగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం క్షతగాత్రులను ఆస్పత్రి వద్ద పరామర్శించడం చనిపోయిన మృత దేహాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం సాధారణంగా మారుతుందే తప్ప ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకోవడంలో లోపం కనబడుతోందని ఆమె అన్నారు. వివిధ రాష్ట్రాలకి చెందిన వందలాదిమందికి పైగా మృతి చెందినట్లు వార్తలు బాధ కలిగిస్తూన్నాయని చనిపోయిన మృతులకు సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేశారు. భవిష్యత్తు లో రైళ్లు ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page