లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు

Spread the love

లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..


సాక్షిత : నాడు -నేడు నిధులు రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో 5 అదనపు తరగతి గదుల నిర్మాణం.. మౌలిక సదుపాయాల కల్పన.. జగనన్న పాలనలో కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో రూపు దిద్దుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలు ..

చదువుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేలా రాష్ట్రంలో నూతన విద్యావిధానానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ..

జగనన్న పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లుకు మంచి ఫర్నీచర్‌ ఏర్పాటు చేశాం.. గ్రీన్‌ చాక్‌ బోర్డులు, విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, మంచినీటి సదుపాయం కల్పించాం. రన్నింగ్‌ వాటర్‌తో మంచి టాయిలెట్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చాం. ప్రతి స్కూలుకు రంగులు వేయించి కాంపౌండ్‌ వాల్, ఇతర మరమ్మతులు చేయించాం.. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టాం ..

జగనన్న ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల తల్లుల్లో, ప్రతి బిడ్డలోనూ విశ్వాసం పెరిగింది.. ఈ ప్రభుత్వం మన మంచి కోసం పనిచేస్తోందన్న భరోసా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది…

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page