New voter registration with key leaders of Nizampet Municipal Corporation
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య నాయకులతో నూతన ఓటరు నమోదు కార్యక్రమంపై ఎమ్మెల్యే సమావేశం…
….
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన ఓటర్ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు
. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు ప్రతీ బస్తీ, కాలనీల్లో ప్రజలకు తెలపాలన్నారు. ఓటరు జాబితాలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులలో ఏమైనా సందేహాలుంటే బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏలతో సమన్వయం చేసుకుని నివృత్తి చేసేలా పని చేయాలన్నారు.
సోషల్ మీడియా ద్వారా ఓటు హక్కు నమోదుపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఓటరు జాబితాలో గతంలో ఉన్న ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, కార్పొరేటర్లు విజయ లక్ష్మి వెంకట సుబ్బారావు, కోలన్ వీరేందర్ రెడ్డి, కాసాని సుధాకర్, చిట్ల దివాకర్, సురేష్ రెడ్డి, సుజాత, బాలాజీ నాయక్, ఆగం రాజు, రవికిరణ్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.