New development works in Secunderabad Deputy Speaker సికింద్రాబాద్ లో మరింత ముమ్మరంగా కొత్త అభివృద్ధి పనులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి సాక్షిత సికింద్రాబాద్, : అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ కార్యకలాపాల నిర్వహణలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థాయికి చేరిందని, మంచి నీటి ఇబ్బందులను ఇప్పటికే పూర్తిగా పరిష్కరించామని, సివరేజి ఇబ్బందుల ను దశల వారీగా పూర్తిగా నివారిస్తామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ లో సుమారు రూ.కోటి రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. కార్పొరేటర్ కుమారి సామల హేమ, భారస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, నేతలు కరాటే రాజు, జలమండలి జనరల్ మేనేజర్ రమణారెడ్డి, డీ జీ ఏం కృష్ణ, అధికారులు అన్విట్ కుమార్, శ్రీమతి నవ్య, కౌశిక్ కుమార్, పోలీస్ ఇన్స్పెక్టర్ నరేష్ తదితరులతో కలిసి డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వివిధ ప్రాజెక్టులతో పాటు సాధారణ సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులను నిరంతరం చేపదుతున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. చిలకలగూడ బడీ మజిద్, ఎరుకల బస్తీ, కింది బస్తీ, మార్కండేయ నగర్, ఉప్పరి బస్తి, బ్రాహ్మణ బస్తే, బసవ తారకం నగర్, నామాలగుండు ప్రాంతాల్లో ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించారు. ఉప్పరి బస్తీ లో రూ.17 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హల్ ఫస్ట్ ఫ్లోర్ ను ప్రారంభించారు. అదే విధంగా మజిద్ గల్లి లో రూ.12 లక్షలు, మార్కండేయ నగర్ లో రూ.12 లక్షల ఖర్చుతో సివరేజ్ పైప్ లైన్ పనులను, బ్రాహ్మణ బస్తీ లో రూ.25 లక్షల ఖర్చుతో సివరేజి లైన్ పనులను, బసవతారకం నగర్ లో రూ.7 లక్షల ఖర్చుతో రోడ్డు నిర్మాణం పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రజలతో ముఖాముఖీ తన పర్యటనలో భాగంగా స్థానికుల సమస్యలను పద్మారావు గౌడ్ అడిగి తెలుసుకున్నారు. మార్కండేయ నగర్ లో ఆకతాయిల ఆగడాల పై స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ ను పిలిపించి ప్రత్యేక నిఘాకు ఏర్పాట్లు జరపాలని ఆదేశించారు. బ్రాహ్మణ బస్తీ ప్రభుత్వ ప్రాధమిక స్కూల్ కు కొత్త భవనాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. బసవతారకం నగర్ లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ హాల్ ను నిర్మించాలని ఆదేశించారు
సికింద్రాబాద్ లో మరింత ముమ్మరంగా కొత్త అభివృద్ధి పనులు డిప్యూటీ స్పీకర్
Related Posts
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…