న్యూ క్లబ్ ఫ్యామిలీ & స్పోర్ట్స్ క్లబ్ లో అధునాతన హంగులతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్

Spread the love

న్యూ క్లబ్ ఫ్యామిలీ & స్పోర్ట్స్ క్లబ్ లో అధునాతన హంగులతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్


సాక్షిత సికింద్రాబాద్ : మారేడుపల్లి న్యూ క్లబ్ ఫ్యామిలీ&స్పోర్ట్స్ క్లబ్ లో అధునాతన హంగులతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.న్యూ క్లబ్ చైర్మన్ నోముల ప్రకాష్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని క్లబ్ మెంబర్స్ కి సేదతీరే విధంగా చిన్నారులు ఈత కొట్టేందుకు వీలుగా రెండు స్విమ్మింగ్ పూల్స్ ప్రారంభించారు.

స్విమ్మింగ్ పూల్ అత్యధిక మోడల్ టెక్నాలజీతో సకల సదుపాయాలతో చిన్నారుల పెద్దలకు ఈత కొట్టేందుకు అనువుగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు క్లబ్ ప్రెసిడెంట్,నోములు ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ ఎం.మహేందర్ రెడ్డి, ట్రెజరీ మధుసూదన్,సి.ప్రదీప్ కుమార్,మేనేజింగ్ కమిటీ సభ్యులు కే.కిరణ్ కుమార్,ఎం వెంకటసాయికుమార్,ఎస్.నరేష్ రాజ్ మరియు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page