ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా నేరెళ్ళ

Spread the love

ఖమ్మం బార్ అసోసియేషన్ కు గత నెల లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం పట్టణం నకు చెందిన నేరెళ్ళ శ్రీనివాసరావు బారి మెజారిటీ తో గెలుపొందారు. గత నెల లో జరిగిన ఎన్నికల లో మొత్తం ఓటర్ లు 946 గాను 757 మంది ఓటర్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే రోజు ఓట్లు లెక్కింపు సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ ఆదేశాలు మేరకు ఓట్లు లెక్కింపు పక్రియ ను నిలిపి వేశారు. నిన్న బార్ కౌన్సిల్ ఆదేశాలు మేరకు మధ్యాహ్నం ఓట్లు లెక్కింపు పక్రియ ను ప్రారంభించి ఫలితాలు ను ఎన్నికల అధికారులు ప్రకటించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా నేరెళ్ళ శ్రీనివాసరావు తమ సమిప ప్రత్యర్ది కన్నెబోయిన నాగేశ్వరరావు పై 352 ఓట్ల మెజార్టీతో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా చింతనిప్పు వెంకటేశ్వరరావు 289 ఓట్ల మెజార్టీతో గ్రంథాలయ కార్యదర్శిగా కన్నెగంటి గోపి 21 స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మిగిలిన పోస్ట్ ల కు గత నెలలో నే ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపాధ్యక్షుడు గా కె. ఉపేంద్ర రెడ్డి , జాయింట్ సెక్రటరీ గా కండే వెంకటేశ్వరరావు, కోశాధికారి గా ఎజ్జగాని శ్రీనివాసరావు, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి గా అలవాల యుగంధర్ రావు, మహిళా ప్రతినిధి గా తన్నీరు లలిత లు ఏకగ్రీవంగా ఎన్నికైనారని బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు న్యాయాధికారులను కలిశారు. సోమవారం సాయంత్రం ఎన్నికల అధికారి లు నూతన కార్యవర్గ సభ్యులు తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల అధికారులు గా మారగాని శ్రీనివాసరావు , కూరపాటి శేఖర్ రాజు , రాయల పావెల్ లు ఎన్నికల అధికారులు గా వ్యవహరించారు. నూతన కార్యవర్గ సభ్యులు కు పలువురు సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page