కర్నూల్ కొండారెడ్డి బురుజు వేదికగా నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ #NBK107 టైటిల్ లాంచ్

Spread the love

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Title Launch At Konda Reddy Buruju (Kurnool)

కర్నూల్ కొండారెడ్డి బురుజు వేదికగా నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ #NBK107 టైటిల్ లాంచ్

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ  #NBK107  టైటిల్ లాంచ్ ఈ నెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదికగా ఐకానిక్ ప్లేస్ కర్నూల్ కొండా రెడ్డి బురుజును ఎంపిక చేయడం విశిష్టతను సంతరించుకుంది. టాలీవుడ్‌లో తొలిసారిగా కొండా రెడ్డి బురుజు వేదికగా వేడుక  జరుపుకుంటున్న చిత్రం #NBK107 కావడం విశేషం. అక్టోబర్ 21, సాయంత్రం 8:15  టైటిల్ లాంచ్‌కి ముహూర్తం ఖరారు చేశారు.  

శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ NBK107కి  సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్

Related Posts

You cannot copy content of this page