పెనుబల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్రతో కలసి నామ పర్యటన

Spread the love

Nama tour with MLA Sandra in Penuballi mandal

పెనుబల్లి మండలంలో ఎమ్మెల్యే సండ్రతో కలసి నామ పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు – రైతు వేదికలు ప్రారంభం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఈ నెల 23వ తేదీన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి విస్తృతంగా పర్యటిస్తారని ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా నామ మండలంలోని తెలగవరం, పాత కారాయిగూడెం , సూరయ్య బంజర తండా, అడవిమల్లేలా, సూరయ్య బంజర్, కోoడ్రుపాడు, కొత్త కారాయిగూడెం , కుప్పెనకుంట్ల, పాత కుప్పెనకుంట్ల, బయ్యన్నగూడెం తదితర గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే తో కలసి పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది.

ఈ సందర్భంగా సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ , గ్రామ పంచాయతీ నూతన భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం తో పాటు రైతు వేదికలను ప్రారంభిస్తారు.పార్టీ నాయకులు , ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు, అభిమానులు , శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎంపీ క్యాంప్ కార్యాలయం కోరింది

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page