అందత్వ నిర్మూలనే కంటి వెలుగు లక్ష్యం – ఎంపీపీ

Spread the love

కంటి వెలుగును సధ్వినియోగం చేసుకోవాలి
పెరేపల్లి లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ
చిట్యాల సాక్షిత ప్రతినిధి

అంధత్వ నిర్మూలనే కంటి వెలుగు కార్యక్రమం యొక్క లక్ష్యం అని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండలం పేరెపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 18సంవత్సరాలు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నందున కంటి సమస్యలు ఉన్న వారందరూ శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించు కోవాలన్నారు.

కంటి చూపుకు సరిపోయే రీడింగ్ అద్దాలను అప్పటికప్పుడే ఇవ్వడం జరుగుతుందని, డిస్క్రైబ్ అద్దాలను వారం రోజుల్లోగా అందజేయడం జరుగుతుందని అన్నారు. కంటి చూపుతో బాధపడే వారి జీవితంలో
ఈ కార్యక్రమం వెలుగు నింపుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ అంతటి వెంకటేష్, ఉప సర్పంచ్ అనగంటి కిరణ్, వైద్యాధికారి డా. యు. నరసింహ, కంటి వెలుగు వైద్యాధికారిణి డా.లావణ్య, పంచాయతీ కార్యదర్శి, ఆప్తమాలజిస్ట్ వసీం, ఎఎన్ఎం ఎస్.సరస్వతి, ఆశా వర్కర్లు అరుణ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page