శంకర్‌పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు శంకర్‌పల్లి మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం అయ్యిందని ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎండిఓ వెంకయ్య గౌడ్ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మాట్లాడుతూ తహశీల్దార్, ఎంపీవో, డీటీ, ఆర్ఎ, ఇంజినీర్లు, ఎంఈవో, ఇతర గెజిటెడ్ స్థాయి అధికారులను ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించిందని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శులకు, ప్రత్యేక అధికారులకు గ్రామ పరిపాలన పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పదేళ్ల తర్వాత గ్రామాలు మళ్లీ ప్రత్యేక పాలనలోకి వెళ్లాయని తెలియజేశారు.
గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన షురూ: ఎంపీడీవో వెంకయ్య గౌడ్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…