2023 క్యాలెండరును ఆవిష్కరించిన ఎంపీ సంతోశ్​ కుమార్

Spread the love

MP Santosh Kumar unveiled the 2023 calendar

2023 క్యాలెండరును ఆవిష్కరించిన ఎంపీ సంతోశ్​ కుమార్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణానికి రాజ్యసభ సభ్యులు శ్రీ.జోగినపల్లి సంతోశ్​ కుమార్ గారు చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచ‌లం అన్నారు.

ఈ సందర్బంగా ప్రకృతి ప్రేమికుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోశ్​ కుమార్ గారు స్వయంగా తన కెమెరాలో బంధించిన చిత్రాలతో ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ముద్రించిన క్యాలెండర్‌ను ఈరోజు ప్రగతి భవన్‌లో ఎంపీ జోగినపల్లి సంతోశ్​ కుమార్ ఆవిష్కరించారు.

అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ… తాను తీసిన చిత్రాలతో క్యాలెండర్‌ను రూపొందించిన అనిల్ ను అభినందించి, ఇది తనకో జ్ఞాపకంగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవ రెడ్డి, సర్దార్ రవీందర్ సింగ్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page