ఎంపీ నామ గొప్ప మానవతావాది

Spread the love

జిల్లా అభివృద్ధి ప్రదాత నామ

సమస్యల పరిష్కారమే నామ నైజం

రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీ తో గెలిపించుకోవాలి

పాలేరు ఆటో అడ్డాలో నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ కార్యక్రమంలో పలువురు వక్తలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మానవత్వానికి చిరునామా , ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత , పేదల పెన్నిధి ఎంపీ నామ నాగేశ్వరరావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. నామ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కూసుమంచి మండలం పాలేరు ఆటో అడ్డాలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకుల చేతుల మీదుగా ఆటో డ్రైవర్లందరికీ భారీ ఎత్తున ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లా డుతూ ఎంపీ నామ ఒక వైపు ఎంపీగా మరో వైపు ట్రస్ట్ తరపున వివిధ రకాలుగా పెద్ద ఎత్తున సేవలందిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

నామకు పేద ప్రజలన్నా, కార్మికులన్నా ఎంతో అభిమానమని, ఏదైనా సమస్య గురించి చెబితే వెంటనే స్పందించి, పరిష్కరించడం ఆయన నైజమని అన్నారు. తన తండ్రి నామ ముత్తయ్య పేరు మీద ట్రస్ట్ పెట్టి, ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల ప్రేమను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు.సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు పెద్ద ఎత్తున ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో నామకు అండగా ఉండి, మంచి మెజార్టీ తో గెలిపించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వేముల వీరన్న, కార్యదర్శి ఎండీ ఆసిఫ్ పాషా, నాయకులు మల్లీడి వెంకన్న , వీరవెల్లి వెంకటేశ్వర్లు, వేలాద్రి నరసింహారావు, పాలేరు గ్రామ శాఖ అధ్యక్షులు రాము,గ్రామ నాయకులు రంజాన్ ఆలీ, పాలేరు అడ్డా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దోమల వెంకన్న, ఉపాధ్యక్షులు కొడావత్ కోటయ్య, తదితరులతో పాటు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page