జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

MLC Shambhipur Raju congratulated the national level gymnastic players

జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు


సాక్షిత : ఈనెల 26వ తేదీ నుండి పంజాబ్ లో జరిగే జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఎంపికైన తెలంగాణ రాష్ట్ర జట్టు సభ్యులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈసందర్బంగా జట్టు సభ్యులకు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. విజేతగా నిలిచి మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, కొంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గంగయ్య నాయక్,

మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, కౌన్సిలర్లు ఎంబరి ఆంజనేయులు, డప్పు కిరణ్, కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, గాజులరామారం డివిజన్ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ యూత్ అధ్యక్షులు మైసిగారి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు శివ యాదవ్, వీజే జిమ్నాస్టిక్ అకాడమీ డైరెక్టర్ విజయ్ పాల్ రెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page