ఐక్యం-2022 ఇంటర్ – స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love


MLA who launched AIKAM-2022 Inter-School Sports Competition…

ఐక్యం-2022 ఇంటర్ – స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో డిఐఎస్, టిఎస్పిఎస్ మరియు డిఎస్ఇ స్కూల్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ దివంగత మధుసూదన్ పంపల్కర్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘ఐక్యం-2022 ఇంటర్ – స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్‘ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బాస్కెట్ బాల్, స్కేటింగ్, త్రో బాల్, టెన్నిస్ కోర్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ టి.టి ఛాంపియన్ మరియు మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ వరుని జైస్వాల్, డిఐఎస్ చైర్ పర్సన్ జ్యోతి పంపల్కర్, డైరెక్టర్లు శిల్పా రవి పంపల్కర్, స్వాతి పంపల్కర్, పూజ పంపల్కర్, అకడమిక్ డైరెక్టర్ శైలజ అబ్బూరి, జిఎం ఉపేంద్ర రవి మరియు స్థానిక వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్ సువర్ణ, నాయకులు లక్ష్మణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page