చెరువులు, నాలాల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

Spread the love


MLA review with the officials on development works of ponds and canals

చెరువులు, నాలాల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చెరువులు, నాలాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఎస్ఎన్డిపి, హెచ్ఎండిఏ అధికారులతో కలిసి పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తుర్క చెరువు, బైన్ చెరువు, దుండిగల్ పెద్ద చెరువు మరియు ఫాక్స్ సాగర్ చెరువుల అభివృద్ధి మరియు కోల్ నాలా, ఫాక్స్ సాగర్ తూము కలువ, కెమికల్ నాలా పనులపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుల అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి వహించి పని చేయాలన్నారు.

మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. చెరువుల వద్ద వాకింగ్ ట్రాక్ లు, సుందరీకరణ పనులకు చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ఇక వరద సమస్యకు చెక్ పెడుతూ చేపడుతున్న నాలాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఎన్డిపి, హెచ్ఎండిఏ ఈఈలు, డిఈలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page