సీతాఫలమండీ లో తాము ప్రారంభించిన ప్రభుత్వ స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజి భవనాలతో పాటు కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పనుల్లో నాణ్యతను పాటించాలని, నాణ్యత విషయంలో రాజీ పడరాదని ఆయన ఆదేశించారు.
సితాఫలమండీ ప్రభుత్వ కాలేజి భవనాల నిర్మాణం పనులను, కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ హయంలోనే ప్రభుత్వ స్కూల్ లో జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త భవనాల నిర్మాణానికి రూ.30 కోట్ల మేరకు నిధులను మంజూరు చేయించామని, పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. నిర్దారిత వ్యవధిలో పనులు పూర్తి చేయాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పద్మారావు గౌడ్ సూచించారు. కార్పొరేటే విద్యా సంస్థలకు దీటైన హంగులతో కొత్త స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజీ భవనాలను తీర్చిద్దిదాలని సూచించారు. అదే విధంగా రూ.11.30 కోట్ల ఖర్చుతో చేపడుతున్న కుట్టి వేల్లోడి ప్రభుత్వ ఆసుపత్ర్హి భవనాల నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని, మల్టీ స్పెషాలిటి ఆసుపత్రిగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. –