MLA Nadipelli Diwakar Rao along with Collector Bharti Holike organized District Level Inspire Science Fair.
మంచిర్యాల జిల్లా నస్పుర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్‌ను కలెక్టర్ భారతి హోలికే తో కలిసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్లుగా పరిగణించాలన్నారు. మనం చేసే ప్రతీ ప్రయోగం సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పారు. అప్పుడే ఆవిష్కరణలకు సార్థకత ఉంటుందన్నారు.
శాస్త్రీయ విప్లవాత్మక ద్వారానే అనేక ఆవిష్కరణలకు పునాదులు పడుతున్నాయని, శారీరక శ్రమలను ఆవిష్కరణల ద్వారా సులభతరం చేయొచ్చన్నారు. దేశ చరిత్రను మార్చే సత్తా కేవలం విద్యార్థులకు మాత్రమే ఉందని అన్నారు. మహాత్మాగాంధీ, డాక్టర్ అంబేడ్కర్, డాక్టర్ అబ్దుల్ కలాంను వారి చదువులో ఉండే నైపుణ్యాల ద్వారానే ప్రపంచం గుర్తించిందని తెలిపారు.
సైన్స్ ఫెయిర్లు విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతలను వెలికి తీసేందుకు దోహదపడుతున్నాయన్నారు. కాలం, బాల్యం, విద్యార్థి దశలు తిరిగి రావని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులు తీసుకువచ్చిన ఎగ్జిబిట్లను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సైన్స్ అధికారి మదు బాబు, సెక్టోరియల్ అధికారులు,AMC చైర్మన్ పల్లె భూమేష్,నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్,వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్,స్థానిక కౌన్సిలర్ వంగ తిరుపతి తదితరులు పాల్గొన్నా రు.