ప్రగతి యాత్ర‘లో భాగంగా 36వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

Spread the love

రంగారెడ్డి నగర్ డివిజన్ జీషన్ బస్తీ, దావూద్ బస్తీ, సంజయ్ గాంధీనగర్ లలో కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ తో ఎమ్మెల్యే పాదయాత్ర…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 36వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా జీషన్ బస్తీ, దావూద్ బస్తీ, సంజయ్ గాంధీనగర్ లలో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ తో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జీశన్ బస్తీ ( నెహ్రూ నగర్ )లో రూ.86 లక్షలతో సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ, స్మశానవాటిక అభివృద్ధి చేసినందుకు బస్తీ వాసులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న రోడ్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. దావూద్ బస్తీ ( నెహ్రూ నగర్ )లో రూ.1.5 కోట్లతో భూగర్భడ్రైనేజీ పైప్ లైన్, సీసీ రోడ్లు, ముస్లీం స్మశానవాటిక అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యే కి బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న రోడ్లు, మంచినీటి సరఫరా, స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంజయ్ గాంధీనగర్ లో రూ.2.39 కోట్లతో మేన్ రోడ్డు, భూగర్భడ్రైనేజీ, మంచినీటి లైన్ల అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యే కి బస్తీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

మిగిలి ఉన్న రోడ్లు, కమిటీ హాల్, హిందూ, ముస్లీం గ్రేవియార్డుల్లో మౌలిక సదుపాయాలు, ప్లేగ్రౌండ్ లో ఆట సామగ్రి ఏర్పాటుకు కృషి చేయాలని బస్తీ వాసులు ఎమ్మెల్యే ని కోరగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటిపై చర్యలు తీసుకొని వేగంగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, మాజీ అధ్యక్షుడు గౌసుద్దిన్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, డిఈఈ భాను చందర్, ఏఈ మల్లారెడ్డి, మేనేజర్ పూజ, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మెహ్ బుబ్, సాబెర్, మొహమ్మద్, ఘన్, ముజీబ్, మొహమ్మద్ మతిన్, షకీల్, గౌస్, మేరీ, జనార్ధన్, శ్రీను, బాలకృష్ణ, షఫీ, అజీమ్, యూసుఫ్, అంజి ముదిరాజ్, సత్యనారాయణ, ప్రసాద్, వెంకటేష్, హరికృష్ణ, వీరయ్య, గణేష్, మల్లేష్, కృష్ణా యాదవ్, అనసూయ, మంగమ్మ, నిర్మల, జావిద్, గౌస్ మరియు నాయకులు ఓంకార్ రెడ్డి, కార్తిక్ గౌడ్, జల్దా లక్ష్మీనాథ్, క్రాంతి యాదవ్, బాలు నేత, అల్లావుద్దీన్, ఈష్వరి, సాయి, తేజ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page