*116 మందికి 1.16 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Spread the love

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట ఎమ్మార్వో ఆఫీసులో కార్పొరేటర్లు అంబర్ పేట ఇ.విజయ్ కుమార్ గౌడ్ , బాగ్ అంబర్పేట్ శ్రీమతి పద్మ వెంకట్ రెడ్డి , నల్లకుంట శ్రీమతి అమృత తో కలసి పెద్ద ఎత్తున, 116 మంది లబ్ధిదారులకు (91 మందికి కళ్యాణ లక్ష్మీ మరియు 25 మందికి షాదీ ముబారక్) ఒకొక్కరికీ, 1,00,116 చొప్పున, మొత్తం 11,613,456 రూపాయల విలువైన చెక్కులను అందచేశారు.

కేసీఆర్ తమ కుటుంబాలకు అండగా నిలిచి, ఆడబిడ్డల పెళ్ళికి కుటుంబ సభ్యుడిలాగా అదుకున్నారని, ఈ సందర్భంగా లబ్ధిదారులు పేర్కొంటూ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో అంబర్ పేట ఎమ్మార్వో శ్రీమతి మీరా బాయి, డిప్యూటీ ఎమ్మార్వో సయ్యద్ హాజీ,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page