“సర్వేపల్లి నియోజకవర్గంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చి, శాశ్వత పరిష్కారం చూపుతాం”- మంత్రి కాకాణి

Spread the love

సాక్షిత SPS నెల్లూరు జిల్లా:* : సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, చెర్లోపల్లి గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.*
మంత్రి కాకాణికి గజమాలలతో ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, గ్రామస్తులు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాలతో పాటు మనుబోలు మండలంలో కూడా ఈ సచివాలయంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తవుతుంది.
గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు, గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.


చెర్లోపల్లి గ్రామ సచివాలయ పరిధిలో 3 కోట్ల 45 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీల జోక్యంతో, రాజకీయ కారణాలతో అర్హులకు అన్యాయం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా అందుతున్నాయి.
విద్యుత్ కొరత ఏర్పడకుండా సాఫీగా విద్యుత్ అందించేందుకు విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశాం.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు.
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం.
గిరిజనులకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వ సహాయంతో పాటు, అదనంగా ప్రతి ఒక్క కుటుంబానికి 15 వేల రూపాయలు అందిస్తున్నాం.


పేద గిరిజనుల ఇళ్ల నిర్మాణాలకు స్థానిక నాయకులు సహకారం అందించడం అభినందనీయం.
పేద గిరిజనులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే, సెంటు స్థలం శవాలు పూడ్చుకోవడానికా అని పేదల ఇళ్ల విషయంలో చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే, చంద్రబాబుకు పేదల పట్ల ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతుంది.

Related Posts

You cannot copy content of this page