వజ్రోత్సవాల ముగింపు వేడుకలు.. సిద్దిపేటలో మొక్కలు నాటిన మంత్రి హరీశ్‌ రావు

Spread the love

సిద్దిపేట జిల్లా :
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు వద్ద మొక్క నాటారు.

మెదక్‌ జిల్లాలోని రామయంపేటలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి మొక్కలు నాటారు. ఇక జిల్లావ్యాప్తంగా 1.41 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. హరితహారంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జనగామ జిల్లా పాలకుర్తి సోమనాథ స్మృతివనంలో మొక్కలు నాటారు.

కాగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి ఫారెస్ట్రెక్‌ పార్కులో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

అదే సందర్భంగా ఆ పార్కును కూడా సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. 360 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్‌ లంగ్‌ స్పేస్‌లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందిచే సరికొత్త థీమ్‌తో ఈ పార్కును అభివృద్ధి చేశారు……

Related Posts

You cannot copy content of this page