ఎమ్మెల్యేను సన్మానించిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు.

Spread the love

ఎమ్మెల్యేను సన్మానించిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని శ్రీ కృష్ణ నగర్ కు చెందిన సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులంతా కలిసిమెలిసి ఉంటూ కాలనీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సంపత్ గౌడ్, జనరల్ సెక్రెటరీ వీరం శెట్టి, ట్రెజరర్ నవీన్, జాయింట్ సెక్రటరీ సతీష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page