వివిధ రకాల చేపల వంటకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి చర్యలు

Spread the love

Measures to make various types of fish dishes available to the public

సాక్షిత : వివిధ రకాల చేపల వంటకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయం ఆవరణలో 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా అభివృద్ధి చేసిన ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేపల వినియోగాన్ని పెంచేందుకు చేపల వంటకాలపై మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ రంగానికి తగిన ఆదరణ లేదని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు.

పెరిగిన మత్స్య సంపదను మత్స్యకారులు విక్రయించుకోవడానికి గాను సబ్సిడీపై వివిధ రకాల వాహనాలు అందజేసినట్లు చెప్పారు. అంతేకాకుండా చేపలు, చేపల వంటకాల విక్రయాల కోసం సబ్సిడీ పై మొబైల్ రిటైల్ ఫిష్ ఔట్ లెట్ లను కూడా అందజేసినట్లు వివరించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంటీన్ లో లభించే చేప వంటకాలకు ఆదరణ పెరిగిన కారణంగా వచ్చే వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

త్వరలోనే వివిధ రకాల వంటకాలతో కూడిన ఫిష్, మటన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ది అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతోనే మత్స్య సొసైటీ లలో సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి, మత్స్య శాఖ JD లు శ్రీనివాస్, మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page