స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా జగనన్న మహిళా మార్ట్ లు : మేయర్ శిరీష

Spread the love

మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి: మిషన్ డైరెక్టర్ మెప్మా విజయ లక్ష్మి

మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోoది : డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి

తిరుపతి, సెప్టెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారిని మహిళా వ్యాపారవేత్తలుగా చేయాలనే లక్ష్యంతో మహిళా మార్ట్ లను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది అని తిరుపతి నగర మేయర్ శిరీష అన్నారు.

శుక్రవారం స్థానిక ఎస్ అర్ కన్వెన్షన్ హాల్ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో మహిళా మార్ట్ ప్రధమ వార్షికోత్సవ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష, మిషన్ డైరెక్టర్ మెప్మా విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, పిడి మెప్మా రాధమ్మ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు.

ఈ కార్యక్రమానికి ముందుగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాలు తయారుచేసిన ఆహా క్యాంటీన్ల ఆహార పదార్థాలను, అర్బన్ మార్కెట్ల లో ప్రదర్శించిన వివిధ స్టాళ్లను మేయర్, డిప్యూటీ మేయర్లు, మెప్మా మిషన్ డైరెక్టర్, పి డి తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి సంక్షేమం ప్రజలకు అందిస్తే పేద కుటుంబాలు బాగుపడతాయనే దిశగా ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. బి, సి గ్రేడులో ఉండే మహిళా సంఘాలు ఇప్పుడు ఏ గ్రేడ్ లో వచ్చేలా మన మహిళా సంఘాలు అభివృద్ధి చెందాయి అని తెలిపారు. మన రాష్ట్ర మహిళా సంఘాల పనితీరును, వారి యొక్క వ్యాపార అభివృద్ధిని, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ప్రగతిని, ఇతర రాష్ట్రాలు మెచ్చుకొనే స్థాయికి ఎదిగామని తెలిపారు. మహిళలను విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో అమ్మబడి, విద్యాదీవెన, వసతి దీవెన, వైయస్సార్ కాపు నేస్తం, చేయూత వంటి పథకాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్ల పట్టాలను కూడా మహిళల పేరు మీదనే ఇచ్చి ఇళ్ల నిర్మాణాల రూపంలో ఆస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు. మహిళా సంఘాలకు స్వయం ఉపాధి కల్పించి వ్యాపార వేత్తలుగా చేయాలనే ఉద్దేశంతో మహిళా మార్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళా మార్ట్ లను ఏర్పాటు చేసి అందులో మహిళా సంఘాలను భాగస్వాములుగా, షేర్ హోల్డర్ చేసి వాటి ద్వారా వచ్చిన లాభాన్ని వారికే చెందేలా ఈ మార్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళా మార్ట్, మహిళా ఈ-మార్ట్, ఆహా క్యాంటీన్లు వంటి వాటిని కూడా ఉపయోగించుకొని ఏ వ్యాపారంలో అయితే అభివృద్ధి సాధించగలరో లేదా మీకు మీకు నచ్చిన వ్యాపారం ఎంచుకొని ప్రగతిని సాధించి మీ కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మహిళా సంఘాలు సాధికారత దిశగా అడుగులు వేస్తూ ఒకప్పుడు పొదుపు మహిళా సంఘాలుగా ఉన్న మహిళలు నేడు వ్యాపారవేత్తలుగా మారేందుకు మహిళా మార్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్వయం సహాయక మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఈ – మార్ట్ లను ఆహార క్యాంటీన్లు, మెప్మా అర్బన్ మార్కెట్లు, ఆసరా సున్నా వడ్డీ పథకాల లబ్దితో స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగనన్న ఈ మార్టు ద్వారా మన మహిళా సంఘాలు తయారు చేసిన ఆహార ఉత్పత్తులను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని తెలిపారు. ప్రతి మహిళా సంఘ సభ్యురాలు ప్రతి నెలా రూ.1000 చొప్పున తమ ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులను మహిళా మార్టు ద్వారానే కొనుగోలు చేసి మరిన్ని లాభాలు చేకూరేలా తోడ్పాటు అందించాలని తెలిపారు. కావున మహిళా సంఘాల సభ్యులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపార వేత్తలుగా ఎదగాలని తెలిపారు.

డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి మాట్లాడుతూ… ఈ మహిళా మార్టులను తొలిసారిగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ మహిళా మార్టుల వలన తిరుపతి జిల్లాలో మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు వెళుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మహిళా సంఘాల సభ్యులందరూ కూడా మహిళా మార్ట్ ల ద్వారా సరుకులను కొనగలిగితే మనం డీ మార్ట్ లతో పోటీ పడగలమని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ మహిళా మార్టు ద్వారా సరుకులు కొంటే తిరిగి ఆ లాభాలు మీ చేతుల్లోకి రావడం జరుగుతుంది అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని తెలిపారు .

మెప్మా పీడీ మాట్లాడుతూ.. ఈ రోజు మనం తిరుపతిలో ఏర్పాటు చేసిన మహిళా మార్టు ఒకటిన్నర సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ప్రధమ వార్షికోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ మహిళా మార్ట్ ద్వారా ఐదు కోట్ల రూపాయలు ఆదాయం రావడం జరిగిందని తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు మహిళా ఉత్పత్తిదారులుగా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని తెలిపారు. ఇలాంటి విజయవంతమైన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా జరుపుకునేలా మహిళా సంఘాలు ముందుకు రావాలని తెలిపారు. మహిళా మార్ట్ లు, ఆహా క్యాంటీన్ లు, అర్బన్ మార్కెట్ లు ద్వారా తయారుచేసిన వస్తువులను ప్రదర్శించి, అమ్ముకోనేలా ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమ అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ ద్వారా వచ్చిన లాభాలను 37,308 మంది మహిళా మార్ట్ వాటాదారులకు రూ.18, 65, 400 డివిడెండ్లను చెక్ రూపం లో అందజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page