ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు : మేయర్ డాక్టర్ శిరీష

Spread the love

సాక్షిత*తిరుపతి నగరం:
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు చేరవేస్తున్న ప్రజాసేవకులు వాలంటీర్లని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 27వ డివిజన్ కు సంబంధించి 17 మంది వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర పురస్కారాలు మేయర్ అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలుందించేందుకు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ప్రజల ఇంటి ముంగిటికే సంక్షేమ పథకాలు చేరువస్తున్న వారి సేవలను గుర్తిస్తూ ప్రోత్సహించాలనే సంకల్పంతో నాలుగు సంవత్సరాలుగా వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర పురస్కారాలు ప్రధానోత్సవం చేసి వారిని సన్మానించుకోవడం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.

ఇందులో భాగంగా ఉత్తమ వాలంటీర్లకు సేవ వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాలు అందజేశామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్డు సచివాలయ, వాలంటీర్లు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆమె తెలిపారు. సకాలంలో అర్వత కలిగిన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజల మన్ననలు మరింత పొందేల ప్రతి వాలంటీర్లు ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు చింతా భరణి యాదవ్, నాయకులు చింతా రమేష్ యాదవ్, గోపాల్ రెడ్డి, గీతా యాదవ్, సచివాలయ అడ్మిన్ సెక్రెటరీ గోపాల్ కృష్ణ, పల్లవి, ఉషారాణి, రేవతి, నిరంజన్ బాబు, రెడ్డి శేఖర్, గాయత్రి, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page