నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇతర పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు..

Spread the love

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
రాబోయే ఎన్నికలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేసి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
సాయంత్రం జరిగిన కార్యక్రమం.


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ పరిధి మధురానగర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే కే.పి. వివేకానంద్ ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,స్థానిక డివిజన్ కార్పొరేటర్ రాఘవేంద్రరావు , ప్రజాప్రతినిధుల సమక్షంలో శ్రీ వెంకటేశ్వర సమేత అష్టలక్ష్మీ ఆలయ చైర్మెన్ బీజేపీ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ విష్ణు వర్ధన్ మరియు వారి ఆధ్వర్యంలో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ప్రసిడెంట్ శ్రీనివాస్,మరియు వారి సభ్యులు,అదే విధంగా ప్రగతి నగర్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ రమేష్ మరియు వారి సభ్యులు,మరియు NMC బిఆర్ఎస్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ యం.డి సలీం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్ ముస్లిం మైనారిటీ సోదరులు,పలువురు కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుండి నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ,మేయర్ , ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్య మంత్రి కెసిఆర్ సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి, అదే విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు,రాబోయే కాలంలో అమలు పరిచే సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ లో చేరిన నాయకులకు, కార్యకర్తలకు, సంక్షేమ సంఘం సభ్యులకు అభినందనలు, మరియు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు ఎమ్మెల్యే వారికీ కండువా కప్పి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు ఆయా డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,అభిమానులు,బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు,ఆయా కాలనీ అసోసియేషన్ సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 20 At 4.17.03 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page